Kamal Haasan: కమల్‌ సరసన విద్యాబాలన్‌?

కమల్‌హాసన్‌ (Kamal Haasan) ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ‘భారతీయుడు’కి కొనసాగింపుగా రూపొందుతున్న ఆ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Updated : 29 Apr 2023 07:15 IST

మల్‌హాసన్‌ (Kamal Haasan) ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ‘భారతీయుడు’కి కొనసాగింపుగా రూపొందుతున్న ఆ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు కొత్త సినిమాకోసం చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. అగ్ర దర్శకుడు మణిరత్నంతో సినిమా చేయడానికి ఇప్పటికే పచ్చజెండా ఊపారు కమల్‌హాసన్‌. సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఇద్దరూ జట్టు కడుతున్నారు. ఇదివరకు ఇద్దరూ కలిసి ‘నాయగన్‌’ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే చేతులు కలిపారు. ఈ సినిమాలో కమల్‌కి జోడీగా విద్యాబాలన్‌ (Vidya Balan) నటించనున్నట్టు తెలుస్తోంది. ఇదివరకు నయనతార పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజాగా నయనతార స్థానంలో విద్యాబాలన్‌ని ఎంపిక చేసుకొనేందుకు ఆమెని సంప్రదదించినట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని