Kamal Haasan: కమల్‌తో సేతుపతి?

విక్రమ్‌ భారీ విజయం తర్వాత మరింత జోరుగా సినిమాలు చేస్తున్నారు ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఆయనో ఓ చిత్రంలో నటించబోతున్నట్లు ఉదయనిధి స్టాలిన్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ప్రముఖ నటుడు సేతుపతి నటింబోతున్నట్లు సమాచారం.

Updated : 18 Nov 2022 07:06 IST

విక్రమ్‌ (Vikram) భారీ విజయం తర్వాత మరింత జోరుగా సినిమాలు చేస్తున్నారు ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan). హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఆయనో ఓ చిత్రంలో నటించబోతున్నట్లు ఉదయనిధి స్టాలిన్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ప్రముఖ నటుడు సేతుపతి నటింబోతున్నట్లు సమాచారం. ‘ఇండియన్‌ 2’లోనే విజయ్‌ సేతుపతి నటించాల్సి ఉండగా అది కుదరలేదు. ఇప్పుడు కమల్‌ ‘కేహెచ్‌ 233’లో అవకాశం దక్కింది. రాజకీయం నేపథ్యంగా సాగే చిత్రమని తెలుస్తోంది. ‘ఇండియన్‌ 2’ చిత్రీకరణ పూర్తి కాగానే ఇది పట్టాలెక్కనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని