Keerthy Suresh: ప్రేమలో పడిన స్టార్ హీరోయిన్..? 13 ఏళ్లుగా రిలేషన్ అంటూ వార్తలు..
స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్(Keerthy Suresh) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కేరళకు చెందిన ఓ వ్యక్తితో ఆమె ప్రేమలో ఉన్నట్లు అందులో రాశారు.
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు కీర్తి సురేశ్ (Keerthy Suresh). ఈ ముద్దుగుమ్మ పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడితో ఆమె ప్రేమలో ఉందని.. 13 ఏళ్ల నుంచి వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఆ కథనాల సారాంశం. అతడు ఒక వ్యాపారవేత్త అని.. కేరళలో అతడికి రిసార్ట్స్ ఉన్నాయని సమాచారం. అయితే వీరిద్దరూ ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని.. నాలుగేళ్ల తర్వాతనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయా కథనాల్లో రాశారు.
కీర్తి సురేశ్ పెళ్లి గురించి ఇప్పటికే పలుమార్లు ప్రచారం జరిగింది. కోలీవుడ్‌కు చెందిన స్టార్ మ్యూజిక్ కంపోజర్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే.. అవన్నీ తప్పుడు ప్రచారాలని నటి కుటుంబసభ్యులు కొట్టిపారేశారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆమెకు ఓ వ్యాపారవేత్తతో వివాహం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల కూడా ఓ స్టార్ హీరో విషయంలో ఆమె పేరును జత చేస్తూ పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు దర్శనమిస్తున్నాయి. తాజాగా మరోసారి కీర్తి ప్రేమ గురించి వార్తలు రావడంతో.. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అయితే.. ఇలాంటి వార్తలపై కీర్తి ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేశ్ ప్రస్తుతం ‘దసరా’, ‘భోళా శంకర్’ల కోసం పనిచేస్తున్నారు. వీటితోపాటు ‘మామన్నన్’, ‘రఘు తాతా’, ‘రివాల్వర్ రీటా’ వంటి తమిళ సినిమాల్లోనూ నటిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: అతి తీవ్రమైన ఐదు భూకంపాలివే..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
KVS Admit cards: కేవీల్లో ఉద్యోగాలకు పరీక్ష రేపట్నుంచే.. అడ్మిట్ కార్డులు పొందండిలా..
-
General News
Parliament: తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు: కేంద్రం
-
World News
Earthquake: భారీ భూకంపం.. తుర్కియేకు భారత సహాయ బృందాలు!
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంప విలయం.. 1600 దాటిన మృతులు