Krithi Shetty: ‘ఖుషి’లో హీరోయిన్‌గా కృతిశెట్టి.. విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న భామ
విజయ్ దేవరకొండ - సమంత ప్రధాన పాత్రలుగా నటిస్తోన్న చిత్రం ‘ఖుషి’. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
హైదరాబాద్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకుడు. ఇంటెన్స్ ప్రేమకథతో ఇది రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతిశెట్టి (Krithi Shetty) నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో అగ్రకథానాయిక సమంత (Samantha) హీరోయిన్‌గా నటిస్తున్నప్పటికీ.. ఇందులో మరో కథానాయికకు అవకాశం ఉందని, దాని కోసం కృతిశెట్టి (Krithi Shetty) అయితే బాగుంటుందని చిత్రబృందం భావించిందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ మేరకు ‘ఖుషి’ టీమ్ కృతిని సంప్రదించగా.. కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పేసిందని ఇండస్ట్రీలో టాక్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ‘ఖుషి’ సెకండాఫ్‌లో కృతి కనిపించే అవకాశం ఉందని, ఆమె పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా ఉండనుందని సమాచారం. మరోవైపు, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత వరకూ పూర్తైంది. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను కశ్మీర్‌లో చిత్రీకరించారు. సమంత అనారోగ్యానికి గురి కావడంతో చిత్రీకరణ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
India News
Shocking: షాకింగ్.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
Movies News
Vishwak Sen: ఇండస్ట్రీలో నన్నెవరూ తొక్కేయాలనుకోలేదు.. విశ్వక్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
General News
SSC: కానిస్టేబుల్(జీడీ) అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. పోస్టుల సంఖ్య 50,187కి పెంపు