DJ Tillu 2: టిల్లు కోసం నయా రాధిక?
టిల్లు అనగానే రాధిక గుర్తొస్తుంది. ‘డీజే టిల్లు’తో ఆ రెండు పాత్రలు చేసిన సందడి అలాంటిది. విజయవంతమైన ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘టిల్లు స్క్వేర్’ పేరుతో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణ ఇప్పటికే షురూ అయ్యింది.
టిల్లు అనగానే రాధిక గుర్తొస్తుంది. ‘డీజే టిల్లు’తో (DJ Tillu) ఆ రెండు పాత్రలు చేసిన సందడి అలాంటిది. విజయవంతమైన ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘టిల్లు స్క్వేర్’ పేరుతో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణ ఇప్పటికే షురూ అయ్యింది. రెండో చిత్రంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) సరసన అనుపమ పరమేశ్వరన్‌ని (Anupama Parameswaran) ఎంపిక చేసినట్టు ఇదివరకు ప్రకటించింది చిత్రబృందం. అయితే ఇప్పుడు అనుపమ ఆ సినిమాలో నటించడం లేదు. ఆమె స్థానంలో మరో కొత్త భామని ఎంపిక చేసుకొంటోంది చిత్రబృందం. నయా రాధికగా మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian) నటించే అవకాశాలున్నాయి. ఆ మేరకు చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోంది. ‘ప్రేమమ్’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మడోన్నా. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, మల్లిక్‌రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఘోరం.. వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..!
-
Movies News
OTT Movies: డిజిటల్ తెరపై మెరవనున్న బాలీవుడ్ తారలు
-
Politics News
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ గృహ నిర్బంధం
-
Crime News
Hyderabad: రామంతపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
World News
Vladimir Putin: రష్యాను ఎదుర్కోవడం సులువు కాదు..: పుతిన్
-
India News
National News:మైనర్లను పెళ్లాడిన 2,044 మంది అరెస్టు