Mrunal Thakur: సూర్య చిత్రంలో మృణాల్‌?

‘సీతారామం’ (Sita Ramam) చిత్రంతో తెలుగు సినీప్రియుల మదిలో సీతగా గుర్తుండిపోయింది మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). ప్రస్తుతం నానితో కలిసి ఆడిపాడేందుకు సిద్ధమవుతోంది.

Updated : 30 Jan 2023 07:24 IST

‘సీతారామం’ (Sita Ramam) చిత్రంతో తెలుగు సినీప్రియుల మదిలో సీతగా గుర్తుండిపోయింది మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). ప్రస్తుతం నానితో కలిసి ఆడిపాడేందుకు సిద్ధమవుతోంది. కాగా, ఇప్పుడామె తమిళ చిత్రసీమ నుంచి పిలుపు అందుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సూర్య (Suriya) కథానాయకుడిగా శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. దిశా పటానీ కథానాయిక. చారిత్రక కథాంశంతో ఓ భారీ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో మృణాల్‌ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్‌ నచ్చడంతో మృణాల్‌ అంగీకారం తెలిపిందని తెలిసింది. ఫిబ్రవరిలో ఆరంభం కానున్న కొత్త షెడ్యూల్‌లో ఆమె సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సూర్య పలు భిన్నమైన రూపాల్లో కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. వెట్రి ఛాయాగ్రాహకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని