బ్లాక్‌బస్టర్‌ మూవీ రీమేక్‌లో నాగబాబు

నటుడు నాగబాబు బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్‌తో ఆయన బీటౌన్‌లోకి వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన...

Published : 24 Mar 2021 01:51 IST

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న నటుడు

హైదరాబాద్‌: నటుడు నాగబాబు బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్‌తో ఆయన బీటౌన్‌లోకి వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘ఛత్రపతి’. ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ రీమేక్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ రూపొందించనున్నారు.

కాగా, తాజా సమాచారం ప్రకారం.. నాగబాబు ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే నాగబాబుతో చిత్రబృందం చర్చలు జరిపినట్లు బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నాగబాబు సైతం తన పాత్ర కోసం సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, సదరు వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని