Simbhu-Nidhi Agarwal: సహజీవనంలో శింబు-నిధి అగర్వాల్..?
‘సవ్యసాచి’ చిత్రంతో దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడిప్పుడే కెరీర్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్నారు అందాల తార నిధి అగర్వాల్. ప్రస్తుతం ‘హీరో’ విడుదల కోసం ఎదురుచూస్తోన్న ఆమె త్వరలోనే...
త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ ప్రచారం
చెన్నై: ‘సవ్యసాచి’ చిత్రంతో దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడిప్పుడే కెరీర్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్నారు అందాల తార నిధి అగర్వాల్. ప్రస్తుతం ‘హీరో’ విడుదల కోసం ఎదురుచూస్తోన్న ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ఆమె ఏడడుగులు వేయనున్నారని సమాచారం.
‘ఇస్మార్ట్ శంకర్’తో విజయం అందుకున్న తర్వాత నిధి అగర్వాల్‌కు కోలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చింది. శింబు కథానాయకుడిగా నటించిన ‘ఈశ్వరన్’ సినిమాలో నిధి హీరోయిన్గా ఛాన్స్ కొట్టేశారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా ఈ జంటకు ఫాలోయింగ్ పెరిగింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నారని.. తరచూ పలు పబ్లిక్ ప్రదేశాల్లో కలిసి కనిపిస్తున్నారని కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారని తెలుస్తోంది. ఈ తరుణంలోనే తమ బంధంపై వస్తోన్న పుకార్లకు పుల్‌స్టాప్ చెప్పాలనే భావనలో నిధి-శింబు ఉన్నారని.. వీలైనంత త్వరగా వివాహం చేసుకోనున్నారని ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు శింబుకు గతంలో పలువురు స్టార్ హీరోయిన్స్‌తో బ్రేకప్లైన విషయం తెలిసిందే. అదే మాదిరిగా నిధికి సైతం ఓ స్టార్ క్రికెటర్‌తో ప్రేమ విఫలమైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
SKY: వాషింగ్టన్ సుందర్ విషయంలో నాదే తప్పు.. వైరల్‌గా మారిన సూర్య వ్యాఖ్యలు
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్
-
Movies News
Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
Sports News
IND vs NZ: చాహల్ విషయంలో హార్దిక్ నిర్ణయం సరైంది కాదు: గంభీర్
-
World News
Pakistan: మసీదులో బాంబు పేలుడు.. 28మంది మృతి, 150మందికి గాయాలు