Pawan Kalyan: చిరు సినిమా ఫంక్షన్‌కు గెస్ట్‌గా పవన్‌‌..?

మెగాస్టార్‌ బ్రదర్స్‌ చిరంజీవి (Chiranjeevi), పవన్‌కల్యాణ్‌ (PawanKalyan) ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి టాలీవుడ్‌...

Updated : 07 Sep 2022 14:37 IST

హైదరాబాద్‌: మెగా బ్రదర్స్‌ చిరంజీవి (Chiranjeevi), పవన్‌కల్యాణ్‌ (PawanKalyan) ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. దీంతో మెగా అభిమానులందరూ త్వరలో జరగనున్న ఆ ఈవెంట్‌ గురించే మాట్లాడుకుంటున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father). మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకొన్న ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ఇది రానుంది. మోహన్‌రాజా దర్శకుడు. రాజకీయ కథాంశంతో సిద్ధమవుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘గాడ్‌ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిత్రబృందం భారీగానే సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా పవన్‌కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు నిర్ణయించుకుందట. పవన్‌ కూడా సుముఖత వ్యక్తం చేశారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో త్వరలో జరగనున్న ‘గాడ్‌ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని