Pooja Hegde: ‘జనగణమన’ కోసం

మరో కొత్త జోడీ ముచ్చట ఇది. అన్నీ కుదిరితే విజయ్‌ దేవరకొండ సరసన పూజాహెగ్డే ఆడిపాడనుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ కథానాయకుడిగా ‘జనగణమన’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Updated : 15 May 2022 09:12 IST

మరో కొత్త జోడీ ముచ్చట ఇది. అన్నీ కుదిరితే విజయ్‌ దేవరకొండ సరసన పూజాహెగ్డే ఆడిపాడనుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ కథానాయకుడిగా ‘జనగణమన’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల కిందటే సినిమాని ప్రారంభించారు. కథానాయికగా పూజాహెగ్డేని ఎంపిక చేయడం కోసం చిత్రబృందం ఆమెని సంప్రదించింది. మొదట ఇందులో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ ఆడిపాడనుందనే మాట వినిపించింది. తాజాగా చిత్రబృందం పూజాహెగ్డే కోసమే ప్రయత్నాలు మొదలు పెట్టింది. హిందీలో  సల్మాన్‌ఖాన్‌తో సినిమా కోసం రంగంలోకి దిగిన ఆమె... తెలుగులోనూ ఇప్పటికే మహేష్‌తో కలిసి నటించేందుకు పచ్చజెండా ఊపింది. మరి ‘జనగణమన’ కోసమూ ఆమె సై అంటుందా? అనేది చూడాలి. ఇందులో విజయ్‌  సైనికుడిగా నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని