Prabhas: ‘ఫైటర్’ తర్వాతేనా?
‘సలార్’ (Salaar) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్ (Prabhas). ఆయన చేయనున్న కొత్త ప్రాజెక్ట్‌పై అటు బాలీవుడ్ నుంచి ఇటు దక్షిణాది వరకు కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది.
‘సలార్’ (Salaar) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్ (Prabhas). ఆయన చేయనున్న కొత్త ప్రాజెక్ట్‌పై అటు బాలీవుడ్ నుంచి ఇటు దక్షిణాది వరకు కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. షారుఖ్‌ఖాన్‌తో ‘పఠాన్’ (Pathaan) తెరకెక్కించి విజయాన్ని అందుకున్న దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) - ప్రభాస్ - హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలయికలో రూపొందనున్న సినిమా గురించే ఆ చర్చంతా. ప్రభాస్ - సిద్ధార్థ్ ఆనంద్ కలయికలో సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రెండేళ్లుగా సన్నాహాలు చేస్తోంది. ‘పఠాన్’ విడుదల తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై చర్చ మరోసారి ఊపందుకుంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ కథానాయకుడిగా ‘ఫైటర్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు సిద్ధార్థ్ ఆనంద్. తర్వాత ప్రభాస్‌తో చేయనున్న సినిమా కోసమే సిద్ధార్థ్ రంగంలోకి దిగుతారని, ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ఊపందుకున్నాయనేది బాలీవుడ్ వర్గాలు చెబుతున్నమాట. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తోపాటు, హృతిక్‌రోషన్ కూడా నటించే అవకాశాలున్నాయి. ఈ కలయికలో సినిమా దాదాపుగా ఖాయమైనట్టే అని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/09/2023)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్