Project K: రెండు భాగాలుగా..?

కథని రెండు భాగాలుగా చెప్పడం చిత్రసీమలో ఓ కొత్త ట్రెండ్‌. ‘బాహుబలి’ నుంచి ఈ తరహా ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆయా కథల పరిధి మేరకే అదంతా! ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) సినిమాని కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే అవకాశాలున్నట్టు సమాచారం.

Updated : 02 Feb 2023 07:10 IST

థని రెండు భాగాలుగా చెప్పడం చిత్రసీమలో ఓ కొత్త ట్రెండ్‌. ‘బాహుబలి’ నుంచి ఈ తరహా ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆయా కథల పరిధి మేరకే అదంతా! ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) సినిమాని కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. ఆ దిశగా చిత్రబృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై వారి నుంచి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఎవరూ స్పృశించని కథతో.. అత్యాధునిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. దీపికా పదుకోణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని