Ranbir Kapoor: ‘ఛాంపియన్’ రణ్‌బీర్ కపూరేనా?
కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా విజయాన్ని కట్టబెడతారు ప్రేక్షకులు. అందుకే విదేశీ భాషా ఇక్కడ రీమేక్‌ల రూపంలో వచ్చి ఆకట్టుకుంటుంటాయి.
కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా విజయాన్ని కట్టబెడతారు ప్రేక్షకులు. అందుకే విదేశీ భాషా ఇక్కడ రీమేక్‌ల రూపంలో వచ్చి ఆకట్టుకుంటుంటాయి. ఈ మధ్య స్పానిష్ చిత్రాలు ఇక్కడకు రావడం మొదలైంది. ఇటీవల తాప్సి నటించిన ‘బ్లర్’ స్పానిష్ చిత్రం ‘జూలియాస్ ఐస్’కు రీమేక్. ఇప్పుడు మరో స్పానిష్ సినిమా ‘ఛాంపియన్స్’ను రీమేక్ చేసే పనిలో ఉన్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్. 2018లో విడుదలైన ఈ చిత్రం వాలేన్షీయన్ స్పెషల్ ఒలంపిక్స్‌లోని బాస్కెట్‌బాల్ టీమ్ అడెరెస్ ఆధారంగా రూపొందింది. ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వంలో వస్తున్న ‘ఛాంపియన్స్’ హిందీ రీమేక్‌లో ఆమిర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ నటించడానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ ఈ సినిమా కాల్షీట్లు సర్దుబాటు కాక సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు సల్మాన్ స్థానంలో రణ్‌బీర్ కపూర్ నటించనున్నారట. ఈ సినిమా కోసం రణ్‌బీర్ కపూర్‌ని కలిశారు అమీర్‌ఖాన్. ‘రణ్‌బీర్ కపూర్ సినిమాలు ఆసక్తిగా ఉంటాయి. ఆయన కొత్తదనం ఉన్న కథలను ఎంపిక చేసుకుంటారు. ఇంతవరకు ఏ క్రీడా చిత్రలలో ఆయన నటించలేదు. ఈ తరహా సినిమా రణ్‌బీర్ కపూర్‌కి మొదటి ప్రాజెక్ట్ అవడం విశేషం. ఈ కథ ఆయనకు నచ్చింది. చిత్రికరణ జూన్‌లో మొదలవుతుంది.’ అని చిత్రవర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.