Rashmika: ‘యానిమల్‌’ కోసం రష్మిక?

హిందీలో వరుసగా అవకాశాలు అందుకొంటోంది రష్మిక మందన్న. ఆమె నటించిన హిందీ సినిమాలు విడుదల కాక ముందే ‘పుష్ప’తో ఆమె పాన్‌ ఇండియా హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఉత్తరాది

Published : 14 Mar 2022 15:20 IST

హిందీలో వరుసగా అవకాశాలు అందుకొంటోంది రష్మిక మందన్న. ఆమె నటించిన హిందీ సినిమాలు విడుదల కాక ముందే ‘పుష్ప’తో ఆమె పాన్‌ ఇండియా హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు శ్రీవల్లిగా ప్రేక్షకులకు సుపరిచితమైంది. దాంతో మరిన్ని హిందీ చిత్రాలు ఆమె తలుపు తడుతున్నాయి. రణబీర్‌ కపూర్‌ కథానాయకుడిగా పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ‘యానిమల్‌’ కోసం రష్మికని సంప్రదించినట్టు తెలిసింది. తెలుగు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించనున్న చిత్రమిది. ఇందులో  ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడేందుకు రష్మిక మందన్నని సంప్రదించినట్టు తెలిసింది. మరి ఆమె నిర్ణయం ఏమిటనేది బయటికి రాలేదు. హిందీలో  ఎన్ని అవకాశాలు వచ్చినా దక్షిణాది పరిశ్రమని వదలకుండా సినిమాలు చేస్తోంది రష్మిక. ఇటీవలే ఆమె ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాలో నటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని