Sai Dharam Tej: కొత్త కథ కుదిరినట్టే!

‘విరూపాక్ష’ (Virupaksha) గా ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించారు హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej). ఈ సినిమా విజయం ఆయనలో ఉత్సాహాన్ని మరింత పెంచింది.

Updated : 29 Apr 2023 07:17 IST

విరూపాక్ష’ (Virupaksha)గా ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించారు హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej). ఈ సినిమా విజయం ఆయనలో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం తన మామయ్య పవన్‌ కల్యాణ్‌తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే జయంత్‌ పానుగంటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవింకా పూర్తవ్వక ముందే సాయితేజ్‌ మరో ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ‘రచ్చ’, ‘బెంగాల్‌ టైగర్‌’ లాంటి మాస్‌ యాక్షన్‌ చిత్రాలతో మెప్పించిన సంపత్‌ నందితో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇది కూడా సంపత్‌ గత చిత్రాల్లాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయి. త్వరలో సినిమా ప్రారంభించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని