Sapthami Gowda: అంబరీష్‌ తనయుడితో ‘కాంతార’ నాయిక?

‘కాంతర’...దేశం మొత్తాన్ని ఊపేసిన కన్నడ చిత్రం. కన్నడలో భారీ విజయం సాధించడమే కాదు ఇతర భాషల్లోకి అనువాదమై అక్కడా వసూళ్ల వర్షం కురిపించిందీ చిత్రం.

Updated : 19 Nov 2022 06:48 IST

‘కాంతర’ (Kantara)...దేశం మొత్తాన్ని ఊపేసిన కన్నడ చిత్రం. కన్నడలో భారీ విజయం సాధించడమే కాదు ఇతర భాషల్లోకి అనువాదమై అక్కడా వసూళ్ల వర్షం కురిపించిందీ చిత్రం. ఈ చిత్రంలో నటించిన రిషబ్‌శెట్టితో పాటు నాయిక సప్తమి గౌడకు (Sapthami Gowda) కూడా మంచి పేరొచ్చింది. అంతకుముందు ఆమె పలు చిత్రాల్లో నటించినా కూడా ‘కాంతర’ విజయం తో ఆమెకు అవకాశాలు వరసకడుతున్నాయి. ఇప్పుడామె 90ల నాటి నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథలో నటించనున్నట్లు సమాచారం. ప్రముఖ నటుడు అంబరీష్‌ తనయుడు అభిషేక్‌ అంబరీష్‌ (Abishek Ambareesh) కథానాయకుడిగా ఎస్‌ కృష్ణ ‘కాళి’ (Kaali) అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాయికగా సప్తమిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోనే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని