Suriya: రెండు భాగాలుగా కంగువ

కథానాయకుడు సూర్య (Suriya), దర్శకుడు శివ కలయికలో ‘కంగువ’ (Kanguva) పేరుతో ఓ బహుభాషా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated : 29 Apr 2023 07:01 IST

థానాయకుడు సూర్య (Suriya), దర్శకుడు శివ కలయికలో ‘కంగువ’ (Kanguva) పేరుతో ఓ బహుభాషా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటాని కథానాయిక. భారీ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాలో సూర్య అత్యంత పరాక్రమవంతుడిగా కనిపించనున్నారు. అయితే ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా మరో భాగం రానున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని చిత్ర సన్నిహిత వర్గాల్లో ఒకరైన నిర్మాత ధనంజయన్‌ ధ్రువీకరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పష్టత ఇచ్చారు. ఈ చిత్ర కథ చాలా పెద్దదని, అందుకే దీన్ని రెండు భాగాలుగా చెప్పాలన ఆలోచనకు వచ్చారని, తొలి భాగం క్లైమాక్స్‌ రెండో భాగానికి చక్కటి ఆరంభమవుతుందని ఆయన చెప్పారు. ఈ సినిమా ప్రస్తుతం కొడైకెనాల్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సూర్యతో పాటు దిశా పటానిపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రీడీలో 10కి పైగా భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది 2024 ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: వెట్రి పళనిసామి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని