Updated : 08 Apr 2022 13:56 IST

Surya: మరో బయోపిక్‌లో సూర్య?

‘ఆకాశం నీ హద్దురా’ కలయికలో మరో చిత్రం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సూర్య కోసం దర్శకురాలు సుధా కొంగర మంచి కథ సిద్ధం చేసినట్టు సమాచారం. సూర్యతో తాను చేయనున్న సినిమా ఓ బయోపిక్‌ అని తాజాగా తమిళ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే అది ఎవరి జీవిత చరిత్ర అనేది బయటపెట్టలేదు. ఇంకా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సూర్య ప్రస్తుతం బాల, శివల దర్శకత్వంలో వస్తున్న రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిని పూర్తి చేసిన అనంతరం ఈ సినిమాకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని