Akshay Kumar: అందాల నాయికలతో అక్షయ్‌!

అక్షయ్‌కుమార్‌ వరస చిత్రాలతో సందడి చేస్తున్నారు. థియేటర్‌లోనో...ఓటీటీలోనూ ఆయన చిత్రాలు విడుదలవుతూనే ఉంటాయి. ఆయన నుంచి మరో కొత్త చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది.

Updated : 23 Nov 2022 07:15 IST

క్షయ్‌కుమార్‌ (Akshay Kumar) వరస చిత్రాలతో సందడి చేస్తున్నారు. థియేటర్‌లోనో...ఓటీటీలోనూ ఆయన చిత్రాలు విడుదలవుతూనే ఉంటాయి. ఆయన నుంచి మరో కొత్త చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘పతీ పత్నీ ఔర్‌ ఓ’ చిత్రంతో విజయం అందుకున్న ముదాస్సర్‌ అజీజ్‌ దర్శకత్వంలో అక్షయ్‌ నటించనున్నారట. ఈ సినిమాకి ‘ఖేల్‌ ఖేల్‌ మే’ అనే పేరుని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వాణీ కపూర్‌ (Vaani Kapoor), తాప్సి (Taapsee) కథానాయికలుగా నటించనున్నట్లు బాలీవుడ్‌ సమాచారం. పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కనుందని, వచ్చే ఏడాది దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని