Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?

ప్రముఖ నటి మీనా (Meena) భర్త విద్యాసాగర్‌ (48)(Vidya Sagar) మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో...

Updated : 29 Jun 2022 11:16 IST

చెన్నై: ప్రముఖ నటి మీనా (Meena) భర్త విద్యాసాగర్‌ (48)(Vidya Sagar) మంగళవారం రాత్రి  హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, విద్యాసాగర్‌ మృతికి సంబంధించి తమిళనాడు స్థానిక పత్రికల్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఎక్కువగా పీల్చడం వల్లే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 

మీనా వాళ్లింటికి అతి చేరువలో పావురాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని.. వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని, గత కొంతకాలంగా దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని ఆయా పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆరంభంలో ఆయనకు కరోనా రావడంతో సమస్య మరింత తీవ్రమైందని, దీంతో వైద్యులు ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని సూచించినప్పటికీ.. దాతలు దొరక్కపోవడంతోనే విద్యాసాగర్‌ మృతి చెందారని సమాచారం.

ఇక, మీనా-విద్యాసాగర్‌ 2009లో వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఈ దంపతులకు నైనికా(Nainika) అనే కుమార్తె ఉంది. నైనికా ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్‌ ‘తేరీ’, అరవింద్‌ స్వామి ‘భాస్కర్‌ ఓరు రాస్కెల్‌’లో బాలనటిగా మెప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని