క్రిష్‌-వైష్ణవ్‌ మూవీ.. టైటిల్‌ అదేనా?

ప్రముఖ దర్శకుడు క్రిష్‌, కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర అంశం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది...

Published : 01 Mar 2021 10:40 IST

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు క్రిష్‌, కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర అంశం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘జంగిల్‌బుక్’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నెట్టింట్లో వార్తలు దర్శనమిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానాలు, వారి కష్టసుఖాలు తెలియజేస్తూ వచ్చిన ఓ నవలను ఆధారంగా చేసుకుని ఈ కథ తెరకెక్కిస్తున్నట్లు క్రిష్‌ ఓ సందర్భంలో తెలిపారు. వైష్ణవ్ ‌తేజ్‌కు జంటగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సందడి చేయనున్నారు. ఇందులో రకుల్‌ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ‘ఉప్పెన’ తర్వాత వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా రానున్న చిత్రమిదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని