Vijay Deverakonda: ‘సలార్’లో విజయ్ దేవరకొండ.. లుక్ సేమ్ టు సేమ్
విజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురురచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వర్క్‌లైఫ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
హైదరాబాద్: ‘లైగర్’తో (Liger) పరాజయం అందుకున్నాడు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రస్తుతం ‘ఖుషి’ పనుల్లో బిజీగా ఉన్న ఆయనకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ‘సలార్’లో (SALAAR) విజయ్ దేవరకొండ భాగం కానున్నారంటూ పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కు సోదరుడిగా విజయ్ కనిపించనున్నారని.. ‘సలార్’ క్లైమాక్స్‌లో విజయ్‌ని పరిచయం చేసి తర్వాత రానున్న ‘సలార్-2’లో కీలకమైన రోల్‌లో ఆయన్ని చూపించనున్నారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.
మరోవైపు, విజయ్ దేవరకొండ గత కొన్నిరోజుల నుంచి ఓ శీతల పానీయం యాడ్ షూట్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోన్న ఈ షూట్ నుంచి ఆయన ఫొటో ఒకటి బయటకువచ్చింది. అందులో ఆయన లుక్ చూస్తే.. ‘సలార్’లో ప్రభాస్‌ని గుర్తు చేసేలా ఉంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ‘సలార్’లో విజయ్ నటిస్తోన్న మాట వాస్తవమేనని అనుకుంటున్నారు.
బాడీగార్డ్ బర్త్‌డే చేసిన విజయ్..!
విజయ్ దేవరకొండ తన మంచి మనసు చాటుకున్నాడు. సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్, ఇతర పబ్లింగ్ మీటింగ్స్‌లో నిరంతరం తనని సంరక్షిస్తోన్న బాడీగార్డ్ పుట్టినరోజును విజయ్ సెలబ్రేట్ చేశాడు. కేక్ కోయించి విషెస్ తెలిపాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Priyanka Gandhi: గాంధీ కుటుంబాన్ని BJP నిత్యం అవమానిస్తోంది : ప్రియాంక
-
Sports News
Cricket: ఫుల్ స్పీడ్‌తో వికెట్లను తాకిన బంతి.. అయినా నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్
-
Movies News
Akanksha Dubey: సినీ పరిశ్రమలో విషాదం.. యువ నటి ఆత్మహత్య
-
Politics News
BRS: రైతుల తుపాన్ రాబోతోంది.. ఎవరూ ఆపలేరు: కేసీఆర్
-
Movies News
Orange: 13 ఏళ్లు అయినా.. ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలే..!