Vikram: మరోసారి అదే కలయికలో!

వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు సాధించుకున్నారు కథానాయకుడు విక్రమ్‌.

Updated : 14 May 2022 12:26 IST

వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు సాధించుకున్నారు కథానాయకుడు విక్రమ్‌. ఆయన ఇటీవలే అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో ‘కోబ్రా’లో నటించిన సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఇప్పుడిదింకా ప్రేక్షకుల ముందుకు రాకముందే.. ఈ కలయికలో మరో చిత్రం పట్టాలెక్కన్నట్లు సమాచారం. ‘కోబ్రా’ చిత్రీకరణ సమయంలోనే విక్రమ్‌కు అజయ్‌ ఓ కథ వినిపించారని, అది ఆయనకు నచ్చడంతో వెంటనే మరో సినిమా చేసేందుకు అంగీకారం తెలిపారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని