Istandwithsonusood: ‘రియల్‌ హీరో’ నివాసంపై ఐటీ దాడులా?

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మందికి సాయం చేసి సోనూసూద్‌ ‘రియల్‌ హీరో’ అనిపించుకున్నారు.

Published : 17 Sep 2021 01:47 IST

దిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మందికి సాయం చేసి సోనూసూద్‌ ‘రియల్‌ హీరో’ అనిపించుకున్నారు. అయితే, నిన్న ఆయన నివాసంలో ఐటీ విభాగం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆదాయ వివరాల్లో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఐటీ దాడులపై సోనూ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో #Istandwithsonusood అనే ట్యాగ్‌తో నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సోనూసూద్‌కు సంబంధించి ముంబయి, లఖ్‌నవూలోని ఆరు ప్రాంతాల్లో రెండో రోజు సోదాలు జరుగుతుండగా అభిమానులు తమ రియల్‌ హీరోను సపోర్టు చేయడం గమనార్హం. కరోనా విజృంభణలో సమయంలో వేలాది మంది వలస కార్మికులకు సహాయం చేసినందుకు సోనూ చాలా మంది నుంచి ప్రశంసలు అందుకున్నారు. కరోనా రెండో వేవ్‌లోనూ పలు సహాయక చర్యలను చేపట్టి వేలాది మంది ప్రేమాభిమానాలను చూరగొన్నారు. ఈ ఐటీ దాడులను ఖండిస్తూ నెటిజన్లు ఆయనకు తమ మద్దతును తెలుపుతున్నారు. ఈ దాడులను ప్రతిపక్షాలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని