Money Heist: వెబ్‌సిరీస్‌ చూసేందుకు ఉద్యోగులకు సెలవిచ్చిన ఐటీ కంపెనీ

Money Heist: నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ‘మనీ హెయిస్ట్‌’ సిరీస్‌ను చూసేందుకు ఓ ఐటీ సంస్థ తమ ఉద్యోగులకు ఒక రోజు సెలవు ఇచ్చింది.

Updated : 06 Dec 2022 13:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుల సినిమాలు.. క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్స్‌ జరిగినప్పుడు వివిధ కంపెనీలు సెలవు ఇవ్వటం చూశాం. ముఖ్యంగా రజనీకాంత్‌ సినిమాలకు ఈ స్థాయి క్రేజ్‌ ఉండటం గతంలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయమే. ఇప్పుడు ఓ వెబ్‌సిరీస్‌ కూడా ఈ స్థాయి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ‘మనీ హెయిస్ట్‌’ సిరీస్‌కు విశేష ఆదరణ ఉంది. సెప్టెంబరు 3వ తేదీ నుంచి ఫైనల్‌ సీజన్‌ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో జైపూర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ‘నెట్‌ఫ్లిక్స్‌ అండ్‌ చిల్‌ హాలీడే’ పేరుతో సెలవు ఇచ్చింది.

లా కాసా డీ పాపెల్‌(ది హౌస్‌ ఆఫ్ పేపర్‌) పేరుతో స్పానిష్‌ నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ రెండు భాగాలుగా రానుంది. రాయల్‌ మింట్‌ ఆఫ్‌ స్పెయిన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగే కథలతో ఈ రెండు తెరకెక్కాయి. సెప్టెంబరు 3న ఒక పార్ట్‌ రానుండగా, డిసెంబరులో రెండో భాగం స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో జైపూర్‌కు చెందిన ‘వెర్వి లాజిక్‌’ సంస్థ తమ ఉద్యోగులకు సెలవు ఇచ్చింది. సీఈవో అభిషేక్‌ జైన్‌ సంతకంతో ఉన్న లెటర్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అయింది. ‘అందరూ ఒకేసారి మానేస్తారు. అందుకు వేర్వేరు కారణాలు చెబుతారని మాకు అర్థమైంది. దీన్ని నివారించేందుకే నేనే ముందుగా సెలవు ఇచ్చేస్తున్నా’ అని జైన్‌ తెలిపారు. దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ స్పందిస్తూ, ఆ ఐటీ కంపెనీ ఆలోచనను అభినందించింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని