Mythri Movie Makers: ‘మైత్రీ మూవీ మేకర్స్‌’పై ఐటీ దాడులు.. 15 చోట్ల సోదాలు

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు చేశారు. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Updated : 12 Dec 2022 14:11 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు చేశారు. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. 

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ గతంలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, రంగస్థలం, సర్కారు వారి పాట, పుష్ప ది రైజ్‌ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం ఆ సంస్థే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలను నిర్మిస్తోంది. సంక్రాంతికి ఆ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణాలకు సంబంధించిన పన్ను చెల్లింపులు, తదితర అంశాలపై వివిధ పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని