Allari Naresh: ఇది సినిమా కాదు.. జీవితం!

‘‘ప్రేక్షకులు ఇప్పుడు కొత్తదనం నిండిన కథల్ని కోరుకుంటున్నారు. అలాంటి ఓ కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రమే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’’ అన్నారు అల్లరి నరేష్‌.

Updated : 25 Nov 2022 07:02 IST

‘‘ప్రేక్షకులు ఇప్పుడు కొత్తదనం నిండిన కథల్ని కోరుకుంటున్నారు. అలాంటి ఓ కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రమే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’’ (itlu maredumilli prajaneekam) అన్నారు అల్లరి నరేష్‌ (Naresh). ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని ఏఆర్‌ మోహన్‌ తెరకెక్కించారు. జీ స్టూడియోస్‌తో కలిసి రాజేష్‌ దండా నిర్మించారు. ఆనంది కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ.. ‘‘ఇదొక నిజాయితీ గల సినిమా. జనం సినిమా. మన చుట్టూ జరిగే కథనే ఇందులో ఆసక్తికరంగా చూపించాం. చివరి ఇరవై నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ను పృథ్వీ అద్భుతంగా తీర్చిదిద్దారు’’ అన్నారు.

‘‘ఈ సినిమాలో లక్ష్మీ పాత్రలో కనిపిస్తా. కొత్త నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని నమ్మకం ఉంది’’ అంది నాయిక ఆనంది. దర్శకుడు ఏఆర్‌ మోహన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది సినిమా కాదు.. జీవితం. కొందరి బతుకు చిత్రం. వినోదం, యాక్షన్‌, పాటలు.. ఇలా అన్ని వాణిజ్య హంగులు ఇందులో ఉన్నాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్‌, శ్రీచరణ్‌ పాకాల, అబ్బూరి రవి, ఛోటా కె.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని