Punch Prasad: పంచ్ ప్రసాద్‌కు తీవ్ర అనారోగ్యం.. సాయం కోరుతూ వీడియో
‘జబర్దస్త్’ నటుడు పంచ్ ప్రసాద్ (Punch Prasad) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ నూకరాజు ఓ వీడియో షేర్ చేశారు.
హైదరాబాద్: జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ (Punch Prasad) కిడ్నీ సమస్యతో ఇబ్బందిపడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని మరో జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తెలిపారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాల్సిందేనని వైద్యులు తెలిపారని, సాయం చేయమంటూ నూకరాజు ఓ వీడియో షేర్ చేశారు. ‘‘గడిచిన మూడేళ్ల క్రితం ప్రసాద్ రెండు కిడ్నీలు పాడైపోయాయి. ఆనాటి నుంచి డయాలసిస్, ఇతర చికిత్సలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు అనారోగ్య సమస్యలకు గురయ్యారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. తప్పనిసరిగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాల్సిందేనని వైద్యులు సూచించారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది లక్షలతో కూడుకున్న వ్యవహారం. దయచేసి మాకు సాయం చేయండి’’ అంటూ నూకరాజు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.