Kevvu Karthik: సందడిగా జబర్దస్త్ కెవ్వు కార్తిక్ వివాహం.. హాజరైన ప్రముఖులు
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తిక్ (Kevvu Karthik) వివాహం ఘనంగా జరిగింది. నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తిక్ (Kevvu Karthik) ఓ ఇంటివాడైయ్యాడు. హైదరాబాద్‌లో గురువారం కార్తిక్ - శ్రీలేఖ (Srilekha)ల వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి జబర్దస్త్ కమెడియన్స్‌తోపాటు టీవీ ఆర్టిస్టులు, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నాయి. కమెడియన్ గెటప్ శ్రీను, అవినాష్‌తో పాటు బుల్లితెర నటీనటులు ఈ జంట ఫొటోలను షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నెటిజన్లు కూడా ఈ కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.
ఇక మొదట్లో సినీ, రాజకీయ ప్రముఖుల వాయిస్‌లను మిమిక్రీ చేయడంతో అందరి దృష్టినీ ఆకర్షించిన కార్తిక్.. అలా జబర్దస్త్‌లోకి (jabardasth) వచ్చాడు. ఆ కార్యక్రమంతో మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస ఈవెంట్లతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గతేడాది విడుదలైన ‘ముఖచిత్రం’, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రాల్లో కనిపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!