Jacqueline: సినీనటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఈడీ సమన్లు

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరీంగ్‌ కేసులో ఈ నెల 8న దిల్లీలో తమ ఎదుట......

Published : 06 Dec 2021 18:08 IST

దిల్లీ: బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరీంగ్‌ కేసులో ఈ నెల 8న దిల్లీలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రూ.200 కోట్లకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసును విచారిస్తున్న ఈడీ అధికారులు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్‌ చంద్రశేఖర్‌, అతని భార్య, నటి లీనా మరియా పాల్‌తో పాటు మరో ఆరుగురి పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. చంద్రశేఖర్‌.. జాక్వెలిన్‌కు విలువైన బహుమతులు ఇచ్చినట్టు గుర్తించి ఆమెను ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుండటంతో జాక్వెలిన్‌పై లుక్‌అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా మరోసారి విచారణకు తమ ఎదుట హాజరు కావాలంటూ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేయడం గమనార్హం.

మరోవైపు, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఆదివారం దుబాయికి బయల్దేరగా.. ముంబయి విమానాశ్రయంలో అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెపై ఈడీ లుక్‌అవుట్‌ నోటీసులు ఉండటంతో విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నిన్న జాక్వెలిన్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని