Updated : 18 Mar 2021 11:53 IST

టైట్రోప్‌ వాకింగ్‌ నేర్చుకున్న జాక్వెలిన్‌

ముంబయి: ‘సాహో’ చిత్రంలో ‘బ్యాడ్‌ బాయ్‌’ అంటూ సాగే ప్రత్యేక గీతంలో ప్రభాస్ సరసన హాట్‌ హాట్‌ అందాలతో ఆకట్టుకున్న భామ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌. ప్రస్తుతం ఈ అమ్మడు ‘బచ్చన్‌ పాండే’ చిత్రంలో మనీషా అనే పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం జాక్వలైన్‌ టైట్రోప్‌ వాకింగ్‌లో శిక్షణ తీసుకుందట. టైట్రోప్‌ వాకింగ్‌ అంటే సన్నని తీగ లేదా తాడు మీద భూమి నుంచి పది అడుగుల ఎత్తులో నడవటం. ఈ కళ వివిధ దేశాల్లో సుదీర్ఘ సంప్రదాయంగా కొనసాగుతోంది. అక్కడి స్థానిక ప్రజలు ఈ కళను ప్రదర్శిస్తుంటారు. మనదేశంలో కొన్ని జాతుల ప్రజలు ఈ కళను ప్రదర్శిస్తుంటారు. టైట్రోప్‌ నేర్చుకోవడం కోసం జాక్వలైన్‌ దాదాపు మూడు వారాల పాటు జైసల్మేర్‌లోనే ఉందట. అసాధారణంగా కేవలం ఒక వారంలోనే ఈ కళను ఆమె ఒంట బట్టించుకుందట. జాక్వలైన్‌కి గతంలో ఫోల్‌ డ్యాన్స్, యోగాలో మంచి పట్టుంది. అందువల్లే టైట్రోప్‌ వాకింగ్‌ తొందరగా నేర్చుకోగలిగిందట. ఈ మధ్యే ‘బచ్చన్‌ పాండే’ సినిమా షూటింగ్‌ జైసల్మేర్‌లో పూర్తి అయింది. ఇందులో అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఫర్హద్‌ షమ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కృతి సనన్‌, పంకజ్‌ త్రిపాఠి, అర్షద్‌ వార్షి తదితరులు నటిస్తున్నారు. నదియాద్‌వాలా గ్రాండ్‌ సన్‌ ఎంటర్‌టైన్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాత సాజిద్‌తో కలిసి జాక్వలైన్ పనిచేయడం ఇది ఎనిమిదోసారి. యాక్షన్‌, కామెడీ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కానుంది. ప్రస్తుతం జాక్వలైన్‌ హిందీలో ‘అటాక్’, ‘భూత్‌ పోలీస్‌’, ‘సర్కస్‌’ చిత్రాల్లో నటిస్తోంది. 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని