వినూత్నంగా ‘జ‌గ‌మే తంత్రం’ పాట‌ల విడుద‌ల  

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘జ‌గ‌మే తంత్రం’ (జ‌గ‌మే తందిరం)  ఆల్బ‌మ్ వ‌చ్చేసింది.

Published : 07 Jun 2021 15:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘జ‌గ‌మే తంత్రం’ (జ‌గ‌మే తందిరం) ఆల్బ‌మ్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విడుద‌లైన ర‌కిట ర‌కిట‌, బుజ్జి పాట‌లు విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో మిలిగిన పాట‌ల కోసం వేచి చూశారు సంగీత ప్రియులు. తాజాగా వారికి ఆ స‌ర్‌ప్రైజ్ అందించింది చిత్ర బృందం. సోష‌ల్ మీడియా వేదిక‌గా రొటీన్‌కి భిన్నంగా ప్ర‌తి గంట‌కి ఓ లిరిక‌ల్ వీడియో సాంగ్‌ని విడుద‌ల చేస్తోంది. రేలా రేలా, నూరేళ్లు నిండిపోయాయా, నాతోటి రేసు గీతాలు విడుద‌లకాగా వేట వేట‌, వెళ్తున్నారా గీతాలు మ‌రికొన్ని గంట‌ల్లో విడుద‌ల కానున్నాయి. భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్ సాహిత్యం అందించిన ఈ పాట‌ల‌కు సంతోష్ నారాయ‌ణ్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ధనుష్‌ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఐశ్వర్య లక్ష్మి నాయిక‌. వై నాట్‌ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని