Jagame Thandhiram 190 దేశాలు.. 17 భాషల్లో విడుదల

తమిళ స్టార్‌ ధనుష్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జగమేతంతిరం’. జూన్‌ 18 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. అయితే..  డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై రికార్డు స్థాయిలో.........

Published : 16 Jun 2021 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ స్టార్‌ ధనుష్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జగమేతంతిరం’. జూన్‌ 18 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. అయితే..  డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై రికార్డు స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. 190 దేశాల్లో 17భాషల్లో ఈ చిత్రం అలరించనుంది. తమిళం, కన్నడ, మలయాళంతో పాటు తెలుగులోనూ ప్రసారం కానుంది. ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే.. కరోనా నేపథ్యంలో ఓటీటీలోనే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ధనుష్‌ ఒక గ్యాంగ్‌స్టర్‌లా కనిపించనున్నాడు. ఐశ్వర్య లక్ష్మి, జేమ్స్‌ కాస్మో, జోజు జార్జ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వై నాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని