Jagamemaya: నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న ‘జగమేమాయ’

చైతన్య, తేజ, ధన్యబాలకృష్ణన్‌ కీలక పాత్రల్లో నటించిన ‘జగమేమాయ’ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.

Updated : 06 Dec 2022 16:32 IST

హైదరాబాద్‌: చైతన్య, తేజ, ధన్య బాలకృష్ణన్‌ కీలక పాత్రల్లో సునీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జగమేమాయ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా డిసెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? డబ్బు కోసం ఎలాంటి పనులు చేస్తారు? వంటి అంశాలను ‘జగమేమాయ’లో చాలా విలక్షణంగా ఆవిష్కరించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్న రిలేషన్‌పై డబ్బు ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని