Jagapathi Babu: అడవిని తలపించే ఇల్లు.. జగపతి బాబు తల్లి జీవన విధానమిది
ప్రముఖ హీరో జగపతి బాబు (Jagapathi Babu) తన తల్లి ఉంటున్న ఇంటి వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్: టాలీవుడ్‌లో జగపతి బాబుకు (Jagapathi Babu) ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోగా కుటుంబ కథా చిత్రాలతో అలరించాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రతినాయకుడిగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక తనకు నచ్చిన విషయాలను సోషల్‌మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంటాడు. తాజాగా ఆయన పెట్టిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
వాళ్ల అమ్మ నివసిస్తున్న ఇంటి వీడియోను పెట్టిన జగపతి బాబు.. ఆమెకు సింపుల్‌గా ఉండడం ఇష్టమని చెప్పారు. ‘‘ఈ చోటు చూసి ఏదో అడవిలా ఉంది అనుకోకండి. ఇది హైదరాబాద్ సిటీలోనే ఉంది. మా అమ్మ ఇక్కడే ఉంటోంది. తనకు ఇలా సింపుల్‌గా ఉండడం ఇష్టం. ఒక యోగిలాగా ఉండడం మా అమ్మకు నచ్చుతుంది. పానకం తాగాలనిపించి మా అమ్మ దగ్గరకు వచ్చాను. చాలా రోజుల తర్వాత ఆమె చేతి వంట తినబోతున్నా’’ అంటూ వాళ్ల అమ్మ ఉంటున్న ఇంటి వీడియోను పెట్టారు.
ప్రస్తుతం జగపతిబాబు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. గోపిచంద్‌తో కలిసి ‘రామబాణం’ (Rama Banam) లో నటిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సలార్’ (Salaar) సినిమాలోనూ జగపతి బాబు నటిస్తున్నారు. వీటితో పాటు మహేశ్, త్రివిక్రమ్‌ల (SSMB28) సినిమాలోనూ ఆయన కనిపించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)
-
Movies News
Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్
-
Movies News
Anasuya: ఇకపై ఆపేద్దామనుకుంటున్నా.. విజయ్‌తో వార్‌పై తొలిసారి స్పందించిన అనసూయ
-
Sports News
Trent Boult: ట్రెంట్ బౌల్ట్ ఈజ్ బ్యాక్.. వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం!