Akhanda: ఉర్రూతలూగించిన ‘జై బాలయ్య’.. ఫుల్‌ వీడియో వచ్చేసింది!

గతేడాది విడుదలై సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన గీతాల్లో ‘జై బాలయ్య’ ఒకటి.

Published : 11 Jan 2022 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది విడుదలై సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన గీతాల్లో ‘జై బాలయ్య’ ఒకటి. ‘అఖండ’ సినిమాలోని ఈ పాట విడుదలైన తక్కువ కాలంలోనే యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుంది. బాలకృష్ణ హుషారైన స్టెప్పులు, తమన్‌ సంగీతం ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఫుల్‌ వీడియో వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూసిన వారికి చిత్ర బృందం ఆ కానుకను అందించింది. బాలకృష్ణ డ్యాన్స్‌ అందరినీ కట్టిపడేసేలా ఉంది. ఆయన సరసన ప్రజ్ఞా జైశ్వాల్‌ పోటీపడి నర్తించింది. అనంత శ్రీరామ్‌ రచించిన ఈ పాటను గీతా మాధురి, సాహితి చాగంటి, సత్య యామిని, అదితి భవరాజు ఆలపించారు.

బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. జగపతి బాబు, శ్రీకాంత్‌, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2021 డిసెంబరులో విడుదలై ఘన విజయం అందుకుంది. అమెరికా నుంచి ఆంధ్రా వరకూ వసూళ్ల వర్షం కురిపించింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో జనవరి 21 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని