‘బాండ్’ కొత్త ట్రైలర్ చూశారా?
జేమ్స్ బాండ్ సినిమా అంటే ఓ ఎమోషన్... అందుకే ఎప్పుడు వచ్చినా సినీ ప్రేక్షకులు అలరిస్తూనే ఉంటారు. అలా మరోసారి ప్రేక్షకుల మన్ననలు అందుకోవడానికి బాండ్ వస్తున్నాడు. ఈసారి ‘నో టైమ్ టు డై’
ఇంటర్నెట్ డెస్క్: జేమ్స్ బాండ్ సినిమా అంటే ప్రేక్షకులకు ఓ ఎమోషన్. అందుకే ఎప్పుడు బాండ్ సినిమా వచ్చినా ప్రేక్షకులు అలరిస్తూనే ఉంటారు. అలా మరోసారి ప్రేక్షకుల మన్ననలు అందుకోవడానికి బాండ్ వస్తున్నాడు. ఈసారి ‘నో టైమ్ టు డై’ అంటూ అలరించబోతున్నాడు. కరోనా వైరస్ - లాక్డౌన్ కారణంగా ఆలస్యమైన ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. నవంబరులో బాండ్ థియేటర్లలో సందడి చేస్తాడని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ రోజు సినిమా కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.
బాండ్ సినిమాల నుంచి ఆశించే ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు, నమ్మలేని యాక్షన్ సన్నివేశాలు, బాండ్ గాళ్స్ అందచందాలు, మిస్టీరియస్ కార్లు, వైవిధ్యమైన వాహనాలు, గన్స్... ఇలా అన్నింటినీ ట్రైలర్లో పొందుపరిచారు. ట్రైలర్ మొత్తం ఒకెత్తయితే... ఆఖరి సన్నివేశంలో బాండ్ ముందు కారు బోల్తా కొట్టడం మరో ఎత్తు. ‘గతం ఇంకా గతించలేదు’ అంటూ బాండ్ నోట డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్ హంగామా... బాండ్ స్టైల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ముగుస్తుంది.
డేనియల్ మరోసారి బాండ్‌గా కనిపిస్తున్న ఈ సినిమాకు కేరీ జోజీ ఫకునగా దర్శకత్వం వహిస్తున్నాడు. రామి మలేక్, లా సేడోక్స్, బెన్ విషా, నవోమీ హారిస్ తదితరులు ఇతర ప్రధాన పాత్రధారులు. నవంబరు 12న ఈ సినిమా యూకేలో విడుదలవుతుండగా, అదే నెల 20న యూఎస్‌లో విడుదల చేస్తున్నారు. మన దేశంలో ఎప్పుడు విడుదల అనే విషయంపై స్పష్టత లేదు. 250 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేస్తామనుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్