Avatar2: ‘అవతార్‌2’ సరికొత్త రికార్డు.. 2బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో స్థానం

2009లో విడుదలైన ‘అవతార్‌’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘అవతార్‌2’(Avatar2: The Way Of Water) సూపర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2బిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసింది. 

Published : 23 Jan 2023 15:07 IST

హైదరాబాద్‌: జేమ్స్‌ కామెరూన్‌(James Cameron) సృష్టించిన మరోలోకం ‘అవతార్‌2’(Avatar2: The Way Of Water). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ విజువల్‌ వండర్‌.. రికార్ట్స్‌లోనూ వండర్స్ క్రియేట్‌ చేస్తోంది. తొలిరోజు నుంచే ఈ సినిమాకు సినీ ప్రియులు క్యూ కట్టారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపరిచే వసూళ్లను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం వసూళ్ల విషయంలో మరో రికార్డును సొంతం చేసుకుంది.

ఈ సినిమా కలెక్షన్లలో 2బిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటింది. ఇప్పటి వరకు ఈ మైలు రాయిని దాటిన ఆరో సినిమాగా ‘అవతార్‌2’ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్ర దర్శకుడు జేమ్స్‌ కామెరూన్ మాట్లాడుతూ ‘అవతార్‌2’ సినిమా 2బిలియన్‌ డాలర్ల వసూళ్లను సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఆ స్థాయిలో కలెక్షన్‌ వస్తే తదుపరి సీక్వెల్స్‌పై నిర్ణయం తీసుకుంటారని తెలిపిన విషయం తెలిసిందే. ఇక ‘అవతార్‌2’ ఇండియాలోనూ రూ.368.20 కోట్లు వసూళ్లు చేసి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్‌ సినిమాగా నిలిచింది. గతంలో విడుదలైన ‘‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్’’ (Avengers: Endgame) భారత్‌లో రూ.367 కోట్లు వసూళ్లు చేసి రికార్డు నెలకొల్పగా ‘అవతార్‌2’ దాన్ని అధిగమించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని