james cameron: అలా తీయడం సబబు కాదు

‘‘మార్వెల్‌, డీసీ ప్రాంఛైజీ చిత్రాల్లోని పాత్రల్లో లేని పరిపక్వత నా రాబోయే ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ పాత్రల్లో ఉంటుంద’’న్నారు ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌. ‘అవతార్‌’కు సీక్వెల్‌గా రూపొందిన చిత్రమిది.

Updated : 27 Oct 2022 13:54 IST

‘‘మార్వెల్‌, డీసీ ప్రాంఛైజీ చిత్రాల్లోని పాత్రల్లో లేని పరిపక్వత నా రాబోయే ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ పాత్రల్లో ఉంటుంద’’న్నారు ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌. ‘అవతార్‌’కు సీక్వెల్‌గా రూపొందిన చిత్రమిది. సామ్‌ వర్తింగ్టన్‌, జో సల్తానా నాయకానాయికలు. ఈ సినిమా డిసెంబరు 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే కామెరూన్‌ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. మార్వెల్‌, డీసీ స్టూడియోస్‌ నుంచి వచ్చిన సూపర్‌ హీరో చిత్రాలపై విమర్శలు చేశారు. ఆయా సినిమాల్లోని పాత్రల మధ్య సంబంధాలు ఉంటాయి కానీ, వాస్తవికంగా అనిపించవన్నారు. ఏదో వారంతా కళాశాలలో ఉన్నట్లు ప్రవర్తిస్తారని విమర్శించారు. అలా సినిమాలు తీయడం సబబు కాదన్నారు. ‘‘అవతార్‌’ సీక్వెల్‌లో వర్తింగ్టన్‌, జో సుల్తానా పోషించిన జేక్‌, నెయిత్రీ పాత్రలు తమ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి చాలా కష్టపడతాయని చూస్తారు. మార్వెల్‌, డీసీ ఫ్రాంచైజీ చిత్రాల్లోని పాత్రల్లో లేని పరిపక్వతను ఈ సినిమాలో జేక్‌, నెయిత్రీ మధ్య చూస్తార’’ని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని