గిరిజనులతో ‘వకీల్‌సాబ్‌’

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన సినిమా చిత్రీకరణ విరామంలో గిరిజనులతో ఉల్లాసంగా గడిపారు.

Updated : 24 Dec 2020 12:37 IST

అరకు : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన సినిమా చిత్రీకరణ విరామంలో గిరిజనులతో ఉల్లాసంగా గడిపారు. వకీల్‌సాబ్‌ షూటింగ్‌లో భాగంగా అరకు వెళ్లిన పవన్‌ విరామ సమయంలో ఆదివాసీలతో ముచ్చటించారు. అడవి తల్లితో ముడిపడిన వారి స్థితిగతులను వివరిస్తూ గిరిజనులు పాడిన పాటను పవన్‌ కల్యాణ్‌ ఆస్వాదించారు. ఈ పాట వింటూంటే విభూతి భూషణ్‌ బందోపాధ్యాయ రచించిన ‘వనవాసి’ గుర్తుకు వస్తోందని పవన్ కల్యాణ్‌ ట్వీట్ చేశారు. 

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్‌సాబ్‌ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న 26వ సినిమా ఇది. హిందీలో వచ్చి మంచి విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. దిల్‌రాజు, బోనీకపూర్‌ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన వకీల్‌సాబ్ సినిమా‌లోని ‘మగువా మగువా’ సాంగ్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. 

ఇవీ చదవండి..
రామ్‌ ‘రెడ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

కరోనా రాసిన స్క్రిప్ట్‌ ఇది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని