జాన్వీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
చేసింది తక్కువ చిత్రాలే అయినా, తన తల్లి నట వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి కష్టపడుతోంది
చేసింది తక్కువ చిత్రాలే అయినా, తన తల్లి నట వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి కష్టపడుతోంది జాన్వీ కపూర్. అలనాటి తార శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల కూతురిగా వెండితెరకు పరిచయం అయినా, తనకంటూ ప్రత్యేకత చాటేందుకు ప్రయత్నిస్తోంది. రూపంలో, నృత్యంలో అమ్మను గుర్తుచేస్తూ తనదైన శైలిలో నటిస్తున్న ఈ భామ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని సంగతులు...
1997 మార్చి 6న ముంబయిలో జన్మించింది జాన్వీ. ఆమెకు ఓ సోదరి. పేరు ఖుషి కపూర్. ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన జాన్వీ.. కాలిఫోర్నియాలోని లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంది.
‘ధడక్’ అనే హిందీ చిత్రంతో 2018లో తెరంగేట్రం చేసింది జాన్వీ. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపుతోపాటు ఉత్తమ నూతన నటి విభాగంలో జీ సినీ అవార్డు అందుకుంది. తర్వాత ఓ ప్రముఖ కాస్మొటిక్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. రెండో సినిమా ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే హారర్ చిత్రంతో ఆకట్టుకుంది. ‘అంగ్రేజీ మీడియం’ చిత్ర ప్రొమోషన్ సాంగ్‌లో సందడి చేసింది.
పైలట్ గుంజన్ సక్సేనా జీవితాధారంగా తెరకెక్కిన ‘గుంజన్ సక్సేనా’లో ప్రధాన పాత్ర పోషించి నటిగా ఓ మెట్టు ఎక్కింది. ఆ పాత్ర పోషించడం గొప్ప వరంగా భావిస్తున్నానని, నటిగా తనని తాను నిరూపించుకునేందుకు ఇదొక సదవకాశం వచ్చిందని ప్రత్యేకంగా చెబుతారామె. కార్గిల్ గర్ల్‌గా ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాను నటించిన మరో హారర్ సినిమా ‘రూహీ’ మార్చి 12న విడుదలకానుంది. ఆమె సంతకం చేసిన ‘దోస్తానా 2’, ‘గుడ్ లక్ జెర్రీ’ సెట్స్‌పై ఉన్నాయి. ఇలా చేసింది తక్కువ సినిమాలే అయినా వైవిధ్య పాత్రలు ఎంపిక చేసుకుంటూ తనని తాను నిరూపించుకుంటోంది.
‘‘నన్ను నటిని చేయాలని అమ్మ ఎప్పుడూ అనుకోలేదు. చెల్లి ఖుషీనే సినిమాల్లోకి పంపించాలనుకుంది. నేను అమాయకురాలినని, కథానాయికకు సరిపోయే రంగు(చర్మం) నాది కాదని అభిప్రాయపడేది. కానీ ఒకానొక సందర్భంలో నటిగా మారాల్సి వచ్చింది’’
జిమ్ చేస్తేనే రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందట జాన్వీకి. అలా చేయని రోజు వృథా అంటుందామె. రోజుకి ఓ సినిమా అయినా చూడాల్సిందే.. లేకపోతే నిద్రపట్టదట. నటికాకపోయి ఉంటే రచయితగానో, ట్రావెలర్‌గానో స్థిరపడేదాన్ని అంటుంటుంది.
జాన్వీని గమనిస్తే ఆమె ఎక్కువగా జిమ్ దుస్తుల్లోనే దర్శనమిస్తుంది. చిత్రీకరణ లేనప్పుడు తనకు నచ్చిన పని చేసుకోవాలంటే జిమ్ దుస్తులే సహకరిస్తాయట. అదొక్కటే కాదు మధ్యలో విరామం దొరికితే జిమ్‌కి వెళ్లడానికి వీలుగా ఉంటాయని అవే ఎక్కువగా ధరిస్తుందట. రోజూ ఉదయం లేవగానే తన సెల్‌ఫోన్ వాల్‌పేపర్ చూసుకోవడం జాన్వీకి అలవాటు. శ్రీదేవి, బోనీకపూర్ జంటగా ఉన్న ఫొటో అది. అల్పాహారానికి ముందు రెండు చెంచాల నెయ్యి తీసుకుంటుందట.
చాలా సింపుల్‌గా జీవించడం జాన్వీకి ఇష్టం. అదీ ఇదీ అంటూ నోరుకట్టేసుకోదు. నచ్చినవన్నీ తినేస్తుంది. ట్రావెలింగ్‌ని ఇష్టపడే జాన్వీ దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు చుట్టేసింది. కానీ, ఎప్పుడూ లేనంత ఆనందంతో పటియాలలోని జైన్ దేవాలయ అందాల్ని చూసి ఎగిరిగంతేసింది.
సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటుంది జాన్వీ. ఎప్పటికప్పుడు తను చేసిన డ్యాన్స్ వీడియోలు అప్‌లోడ్ చేస్తూ అలరిస్తుంది. తల్లిపై ఉన్న ప్రేమనూ అభిమానులతో పంచుకుంటుంది. తనకు సామాజిక మాధ్యమాల్లో అన్నింటికంటే ఇన్‌స్టాగ్రామ్ అంటే ఇష్టమట. 2014 ఆగస్టు 27న ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన జాన్వీ సుమారు 10 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.
మరికొన్ని..
* ఇష్టమైన హీరోలు: షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్.
* ఇష్టమైన హీరోయిన్లు: దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా.
* ఇష్టమైన సినిమాలు: దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే (హిందీ), వెన్ హ్యారీ మెట్ సాలీ (హాలీవుడ్)
* అలవాట్లు: ప్రయాణాలు చేయడం, పాటలు వినడం, నృత్యం, పెయింటింగ్.
* ఇష్టమైన వంట: రోగన్ జోష్ (పర్సియన్ పద్ధతిలో తయారుచేసే మటన్)
* ఇష్టమైన దుస్తులు: షార్ట్స్(నిక్కర్లు), లూజుగా ఉండే ప్యాంట్లు, బెల్ బాటమ్ ప్యాంటు- తెల్లచొక్కా కాంబినేషన్.
* ఇష్టమైన రంగు: పింక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు