‘గుడ్‌ లక్‌ జెర్రీ’ షూటింగ్‌ పూర్తి చేసుకున్న జాన్వీ

బాలీవుడ్‌ కథానాయిక జాన్వీ కపూర్‌ నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ జెర్రీ’. సిద్ధార్థ్ సేన్‌ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

Published : 20 Mar 2021 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ కథానాయిక జాన్వీ కపూర్‌ నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ జెర్రీ’. సిద్ధార్థ్ సేన్‌ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ..‘‘ఈ చిత్రం ఇంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసుకుందంటే నమ్మలేకపోతున్నా. సినిమా షూటింగ్‌ సమయంలో ఎంతో నేర్చుకున్నా. చిత్రీకరణ సమయంలో చాలామంది ముఖాల్లో కొంత నిరాశ కనిపించింది. వాటిని దూరం చేయడానికి సెట్లో అందరినీ నవ్వించేదాన్ని. దాంతో అవన్నీ మరిచిపోయి షూటింగ్‌లో పాల్గొనేవాళ్లు. అందరం కలిసి పనిచేశాం. మీ అందరిని మిస్ అవుతున్నా. ప్రతిఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ తెలిపింది.

‘గుడ్‌ లక్‌ జెర్రీ’ చిత్రం 2018లో తమిళంలో నయనతార ప్రధాన పాత్ర పోషించిన ‘కోలమావు కోకిలా’ చిత్రానికి రీమేక్‌. ప్రస్తుతం జాన్వీ - కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'దోస్తానా 2'లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన హర్రర్‌ చిత్రం ‘రూహి’లో అఫ్జానాగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని