
janhvi kapoor: అమ్మ చేత్తో నాకోసం రాసిందే... నాచేతిపై టాటూ
తల్లి శ్రీదేవిని గుర్తుచేసుకున్న జాన్వీకపూర్
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన తల్లి, ప్రముఖ హీరోయిన్, శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ ఓ భావోద్వేగ పోస్టు చేశారు. 2018లో శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తల్లిని ఎంతో ప్రేమించే జాన్వీ ఆమె జ్ఞాపకార్థం... అమ్మ చేత్తో తన కోసం రాసిన మాటల్నే.. చేతిపై టాటూగా వేయించుకున్నారు. శ్రీదేవి జాన్వీని ముద్దుగా లబ్బూ అని పిలుస్తారట. ‘‘ ఐ లవ్ యూ మై లబ్బూ,. యూ ఆర్ ది బెస్ట్ బేబీ ఇన్ ది వరల్డ్’’ అని శ్రీదేవి ఓ పేపర్ మీద రాసిచ్చిన వ్యాక్యాల్లో ‘‘ ఐ లవ్ యూ లబ్బూ’’ పదాలను చేతిపై ఎప్పటికీ చెదరకుండా ఉండేలా పర్మనెంట్ టాటూ వేయించారు. ఈ సందర్భంగా ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. వాటితో పాటు ఇటీవలే ఆమె సందర్శించిన దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల ఫొటోలను జతచేశారు.
అందుకే ఆ చీర అంటే స్పెషల్..
చిన్నప్పుడు శ్రీదేవి ధరించిన చీర అంటే జాన్వీకి ఎంతో ఇష్టమట. ‘మామ్’లో శ్రీదేవి నటనకు గానూ జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. అప్పటికే ఆమె కన్నుమూయడంతో తన తల్లి తరఫున జాన్వీ కపూర్ ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమానికి శ్రీదేవి చీరను ధరించి అవార్డు అందుకోవడం విశేషం.
ఇవీ చదవండి
Advertisement