Janhvi Kapoor: అతడిని ఎంతో నమ్ముతా.. బాయ్‌ఫ్రెండ్‌ గురించి పెదవి విప్పిన జాన్వి

ఓ వ్యాపారవేత్త కుమారుడితో బాలీవుడ్‌ నటి జాన్వికపూర్‌ ప్రేమలో ఉందంటూ ఎంతోకాలం నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈవార్తలపై తాజాగా ఆమె స్పందించారు.

Updated : 07 Nov 2022 13:44 IST

ముంబయి: తన ఆప్త మిత్రుడు ఒర్హాన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor). అతడితో ఉంటే తాను ఎప్పుడూ సంతోషంగా ఉంటానని ఆమె చెప్పారు. ‘మిలీ’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్నేహితుడి గురించి స్పందించారు. ‘‘ఒర్హాన్ నాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. అతడితో ఉంటే నేను ప్రతిక్షణం ఆనందంగానే ఉంటా. అన్నివిషయాల్లోనూ ఎంతోకాలం నుంచి అండగా నిలిచాడు. అతడిని ఎంతో నమ్ముతున్నాను. అతడు నా పక్కన ఉంటే మా ఇంట్లో ఉన్నాననే భావన కలుగుతుంది’’ అని తెలిపారు.

ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన ఒర్హాన్‌తో జాన్వి ఎంతోకాలం నుంచి స్నేహం చేస్తోంది. బీటౌన్‌ ఫంక్షన్స్‌లో వీరిద్దరూ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. పార్టీలు, డిన్నర్‌లు, విదేశీ టూర్‌లు.. ఇలా ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. దీంతో ఈ జంట ప్రేమలో ఉందంటూ పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గానూ మారాయి. ఈ నేపథ్యంలో జాన్వి చెప్పిన మాటలు వింటుంటే వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్న మాట వాస్తవమే అయి ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని