Janhvi Kapoor: ‘నాన్న ఆ అలవాటు మానేందుకు అమ్మ రిస్క్‌ చేసింది’: జాన్వీకపూర్‌

తన తదుపరి సినిమా ‘మిలీ’ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా పాల్గొంటున్నారు నటి జాన్వీకపూర్‌. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కుటుంబం గురించి ఆసక్తికర విశేషాలు బయటపెట్టారు.

Updated : 26 Oct 2022 16:13 IST

ముంబయి: బాలీవుడ్‌ బడా నిర్మాత, తన తండ్రి బోనీకపూర్‌కు (Boney Kapoor) ఉన్న ఓ అలవాటును మాన్పించడానికి శ్రీదేవి ఎంతో శ్రమించిందని నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) తెలిపారు. తన తదుపరి సినిమా ‘మిలీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన తండ్రి గురించి ఆసక్తికర విశేషాలను బయటపెట్టారు.

‘‘ఇది చాలా ఏళ్ల కిందటి విషయం. ‘వాంటెడ్‌’, ‘నో ఎంట్రీ’ సమయంలో ఇది జరిగింది. అప్పట్లో నాన్న సిగరెట్లు కాల్చేవారు. ఆయనను సిగరెట్లకు దూరంగా ఉంచడం కోసం నేను, ఖుషి ఎంతో ప్రయత్నించేవాళ్లం. నాన్నకు తెలియకుండా ప్రతిరోజూ సిగరెట్లను ముక్కలు ముక్కలుగా చేసేసేవాళ్లం.
ఒక్కొసారి ఆ ప్యాకెట్‌లో టూత్‌పేస్ట్‌ పెట్టేసేవాళ్లం. మేమిద్దరం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మారలేదు. దాంతో మా అమ్మ శాకాహారిగా మారిపోయారు. సిగరెట్లు మానకపోతే మాంసాహారాన్ని తీసుకోనని పట్టుబట్టారు. ఆమె వీక్‌గా ఉన్నారని, తప్పకుండా మాంసాహారాన్ని తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచించినప్పటికీ అమ్మ అంగీకరించలేదు. నాన్న బతిమలాడినా అమ్మ వినలేదు. అలా, కొంతకాలానికి నాన్న ఆ ధూమపానాన్ని వదిలేశారు’’ అని జాన్వి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని