Janhvi Kapoor: వాటిని నమ్మొద్దు.. జాన్వీ సోషల్‌ మీడియా ఖాతాలపై టీమ్‌ క్లారిటీ

జాన్వీ కపూర్‌కు ఎక్స్‌లో అధికారిక ఖాతా లేదని టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. ఫేక్‌ అకౌంట్‌లను నమ్మొద్దని తెలిపింది.

Published : 18 Jun 2024 10:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు, సినిమాల విశేషాలు పంచుకుంటారు. అయితే, తాజాగా ఆమె (Janhvi Kapoor) పేరుతో ఉన్న ఓ ఎక్స్‌ అకౌంట్‌లో అసభ్యకరమైన పోస్ట్‌లు దర్శనమిచ్చాయి. దీంతో ఈ ఖాతాలపై టీమ్‌ క్లారిటీ ఇచ్చింది.

‘డిజిటల్‌ ప్రపంచంలో ఎవరి పేరుతోనైనా అకౌంట్‌ క్రియేట్‌ చేయడం సులభంగా మారింది. జాన్వీకపూర్‌కు అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతా లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాం. దయచేసి ఈ ఫేక్‌ అకౌంట్‌లను ప్రోత్సహించకండి. వాటిని ఫాలో కావొద్దు. వీటిలో పోస్ట్‌ చేసే సమాచారాన్ని నమ్మొద్దు. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు’ అని అప్రమత్తంగా ఉండాలని టీమ్‌ కోరింది. ఆమె పేరుతో ఎక్స్‌లో ఉన్న నకిలీ ఖాతాల వివరాలను పేర్కొంది. జాన్వీ (Janhvi Kapoor) ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండడం కోసం కేవలం ఇన్‌స్టానే వాడతారని టీమ్‌ పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్‌స్టాలో 24 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.

‘పుష్ప 2’ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన టీమ్

ఇటీవల ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌లో జాన్వీ మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా అంటే తనకు భయమని తెలిపారు. ప్రముఖ సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ రెడిట్‌(Reddit)ను తనకంటే తన చెల్లి ఖుషీనే ఎక్కువగా వాడుతుందని చెప్పారు. ఇందులో విశేషాలు చెల్లిని అడిగి తెలుసుకుంటానని ఆమె వెల్లడించారు. ఇటీవలే ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సరసన నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని