Bollywood: జాన్వీ.. వరుణ్‌ల ‘బవాల్‌’

వరుణ్‌ధావన్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న ‘బవాల్‌’ సినిమా చిత్రీకరణ లఖ్‌నవూలో ఆదివారం ప్రారంభమయ్యింది. ‘దంగల్‌’, ‘చిచోరే’ చిత్రాలను అందించిన నితేష్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 11 Apr 2022 09:05 IST

రుణ్‌ధావన్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న ‘బవాల్‌’ సినిమా చిత్రీకరణ లఖ్‌నవూలో ఆదివారం ప్రారంభమయ్యింది. ‘దంగల్‌’, ‘చిచోరే’ చిత్రాలను అందించిన నితేష్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘షూటింగ్‌లో పాల్గొనడానికి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. వరుణ్‌, జాన్వీల మధ్య ఉండే కెమిస్ట్రీ, నితేష్‌ తివారీ కథ చెప్పే విధానం ఈ సినిమాకు ప్రధాన బలం’ అని చిత్ర వర్గాలు వెల్లడించాయి. వచ్చే సంవత్సరం వేసవికి  ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని సాజిద్‌ నడియద్‌వాలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్‌ ‘బవాల్‌’తో పాటు ‘జగ్‌ జగ్‌ జీయో’, ‘భేడియా’ చిత్రాల్లో నటిస్తున్నాడు. మరోవైపు జాన్వీ ‘గుడ్‌ లక్‌ జెర్రీ’, ‘మిలీ’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహీ’ సినిమాలతో బిజీగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని