‘హెలెన్‌’ కోసం యూఎస్‌ఏలో జాన్వీ ఏం చేస్తోంది?

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ ప్రస్తుతం తన చెల్లి ఖుషి కపూర్‌, చిన్నాన్న కూతురు అన్షులాతో కలిసి యుఎస్‌ఏలో ఉంటుంది. తను చేయబోయో కొత్త సినిమా ‘హెలెన్‌’ కోసం అక్కడే కసరత్తలుచేస్తుందట. మలయాళంలో విజయవంతమైన ‘హెలెన్‌’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయున్నారు.

Published : 31 Mar 2021 18:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ ప్రస్తుతం తన చెల్లి ఖుషీ కపూర్‌, సోదరి అన్షులతో కలిసి యూఎస్‌ఏలో ఉంది. తను చేయబోయే కొత్త సినిమా ‘హెలెన్‌’ కోసం అక్కడే కసరత్తులు చేస్తోందట. మలయాళంలో విజయవంతమైన ‘హెలెన్‌’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయున్నారు. మాతుకుట్టి జేవియర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని కథానాయిక పాత్ర చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది.

ఫ్రీజర్ గదిలో -18 డిగ్రీల సెంటిగ్రేడ్‌ చలిలో ‘హెలెన్’ ఉంటుంది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పుడు జాన్వీ చేయబోయో పాత్ర కూడా అదే.  చిత్రం గురించి నిర్మాత బోనీకపూర్‌ స్పందిస్తూ..‘‘ఈ సినిమా జాన్వీకి ఓ సవాల్‌తో కూడుకున్న పాత్ర. సహజంగా నటించకపోతే ప్రేక్షకులు సినిమాని తిరస్కరిస్తారు. ప్రేక్షకులను మెప్పించాలంటే ఆ పాత్ర కోసం జాన్వీ చాలా కష్టపడాల్సి ఉంటుంది’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని