ఈ సీన్లు ఎందుకు డిలీట్‌ చేశారయ్యా: పార్ట్‌2

నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘జాతిరత్నాలు’. ఫరియా

Published : 07 Apr 2021 01:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా కథానాయిక. అనుదీప్‌ దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి టాక్‌ వచ్చింది. నిడివి కారణంగా ‘జాతిరత్నాలు’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు కత్తెర వేశారు. ‘ఈ సీన్లు ఎందుకు డిలీట్‌ చేశారయ్యా’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ స్వప్నమూవీస్‌ వాటిని అభిమానులతో పంచుకుంది. కాగా, పార్ట్‌2 అంటూ మరికొన్ని సన్నివేశాలను తాజాగా విడుదల చేశారు.ఆద్యంతం నవ్వులు పంచేలా ఉన్న ఆ సన్నివేశాలను మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని