‘ఈ సీన్లు ఎందుకు డిలీట్‌ చేశారయ్యా’

2021 సంవత్సరంలో విడుదలైన చిత్రాల్లో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్న సినిమా

Published : 03 Apr 2021 17:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2021 సంవత్సరంలో విడుదలైన చిత్రాల్లో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్న సినిమా ‘జాతి రత్నాలు’. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అనుదీప్‌ దర్శకత్వం వహించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి టాక్‌ వచ్చింది. కథానాయిక ఫరియా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిడివి కారణంగా ‘జాతిరత్నాలు’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు కత్తెర వేశారు. ‘ఈ సీన్లు ఎందుకు డిలీట్‌ చేశారయ్యా’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ స్వప్నమూవీస్‌ వాటిని అభిమానులతో పంచుకుంది. ఆద్యంతం నవ్వులు పంచేలా ఉన్న ఆ సన్నివేశాలను మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని